తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్ పోర్టులు ఇవే

తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్ పోర్టులు ఇవే

0
91

తెలంగాణలో ఎయిర్ పోర్ట్ అంటే శంషాబాద్ బేగం పేట గుర్తువస్తాయి.. అయితే తాజాగా తెలంగాణలో సరికొత్తగా ఎయిర్ పోర్టులు మరిన్ని రానున్నాయి అనే గుడ్ న్యూస్ వినిపిస్తోంది ప్రభుత్వం నుంచి ..ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా . ఏరోనాటికల్ సర్వేతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో విమానాశ్రయాలుంటే నిర్వహణపరంగా నష్టాలుండవు… వంటి అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని సూచించింది.

ఆరు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు, అందులో మూడింటిని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులుగా నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. అందులో మొదటిది వరంగల్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామన్నూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే విమానాశ్రయాలకు ప్లేస్ అన్వేషన చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లాలోని గుడిబండ ప్రాంతాలు అనుకూలమని గతంలోనే ఏఏఐ వెల్లడించింది…వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టులు లాభం అని తెలుస్తోంది. దీనిపై పీపీపీ చేస్తారా లేదా ప్రభుత్వమే ముందుకు టెండర్లు పిలుస్తుందా అనేది చూడాలి.