తెలంగాణా వైపు వస్తున్న మిడతల దండును తరిమికొట్టేందుకు ఏర్పాట్లు

తెలంగాణా వైపు వస్తున్న మిడతల దండును తరిమికొట్టేందుకు ఏర్పాట్లు

0
96

ఇప్పటికే పంజాబ్ రాజస్ధాన్ మహరాష్ట్రాలో ఈ మిడతల దండు పంటలను నాశనం చేశాయి, ఇప్పుడు
మిడతల దండు ఆదిలాబాద్ జిల్లా వైపుకు వేగంగా దూసుకు వస్తోంది. దీంతో సరిహద్దుల్లో ఉన్న జిల్లాకు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. రైతులు ఇప్పటికే పంటలు ఏమీ వెయ్యకపోవడంతో ఇబ్బంది లేదు.. కాని వానలు పడే సమయానికి అవి వస్తే పెద్ద ఇబ్బందే.

పది రకాలుగా ఉండే మిడతల్లో ఈ ఎడారి మిడతలు అత్యంత ప్రమాదకరమైనవిగా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఈ మిడతలు పత్తి, మెక్కజొన్న, జొన్న లాంటి పంటలను బాగా ఇష్టపడతాయి అంటున్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన బోథ్, తాంసి, తలమడుగు, జైనథ్, బేల, భీంపూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో మిడతల బెడదపై ఆందోళన కనిపిస్తోంది. అందుకే వ్యవసాయ శాఖ అధికారులు రైతులని అప్రమత్తం చేశారు.. జిల్లాల్లో వివిధ రకాల రసాయనాలను సిద్ధం చేస్తున్నారు. వివిధ రకాల శబ్దాలు, రసాయనాలతో పిచికారీ చేసి వీటిని తరిమి వేయాలని అధికారులు రైతులకి సూచిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్, కామారెడ్డి, అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్భూపాలపల్లి జిల్లాల రైతులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.