తెలంగాణ‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోతే ఇక అంతే

తెలంగాణ‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోతే ఇక అంతే

0
86

ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా మంది బైక్స్ కార్లు న‌డిపే స‌మ‌యంలో వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసిన స‌మ‌యంలో ఎవ‌రైనా ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోతే వారికి ఫైన్లు బాదుడు ఉండేది, ఇప్పుడు తెలంగాణ పోలీసులు మ‌రింత క‌ఠినంగా ఈ రూల్స్ లో ఉంటున్నారు. ఇక లాక్ డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా వాహ‌నాలు కూడా రోడ్ల‌పైకి భారీగా వ‌స్తున్నాయి.

దీంతో వాహ‌నదారులు క‌చ్చితంగా రూల్స్ పాటించాలి అని చెబుతున్నారు, ఇప్ప‌టి వ‌ర‌కూ బండిపై ఇద్ద‌రు వెళ్లినా బైక్ న‌డిపే వ్య‌క్తి హెల్మెట్ పెట్టుకునేవారు, కాని ఇప్పుడు బైక్ పై ఇద్ద‌రు వెళితే ఇద్ద‌రూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, ఒక‌వేళ ఇద్ద‌రూ హెల్మెట్ పెట్టుకోక‌పోతే భారీగా ఫైన్ క‌ట్టాల్సిందే.

ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బైక్ సైడ్ మిర్రర్స్ లేకున్నా ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి దొరికితే రూ. 100, రెండోసారి దొరికితే రూ. 300 ఫైన్ పడుతుంది.ఇక నాశిర‌కం హెల్మెట్ వాడితే ఊరుకోరు, హెల్మెట్ క్వాలిటీది వాడాలి, హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నా కుద‌ర‌దు,, ఫుల్ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే.