ఉత్తమ్ కు తలసాని దిమ్మతిరిగే కౌంటర్

ఉత్తమ్ కు తలసాని దిమ్మతిరిగే కౌంటర్

0
92

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఇక కనిపించనుంది, అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా ఈ రెండు ఎన్నికల్లో పోటికి సిద్దం అవుతున్నాయి, అయితే మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అనడం చాలా హస్యాస్పదంగా ఉంది అన్నారు మంత్రి తలసాని.

బీసీలకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ముందు మీ పార్టీలోని బీసీ నాయకులకు విలువ ఇవ్వండని ఉత్తమ్‌ని ఉద్దేశించి తలసాని అన్నారు… అయితే ముందు ఉత్తమ్ ఓ విషయాన్ని గుర్తించాలి ఏకంగా బీసీలకు అన్యాయం జరుగుతోంది అని ఒక హోటల్‌లో ఉత్తమ్‌కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారని అది మర్చిపోయారా అని విమర్శించారు.

కాంగ్రెస్‌వి చిల్లర రాజీయాలని… ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుందన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో విజయం తమదేనని కచ్చితంగా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు అని తెలిపారు… షెడ్యూల్ విడుదలవగానే కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసిందన్నారు, మొత్తానికి మరోసారి తెలంగాణలో ఎన్నికల జాతర కనిపిస్తోంది.