హైదరాబాద్ అనగానే వెంటనే ఫుడ్ విషయంలో బిర్యానీ అంటారు అందరూ. ఇక్కడ ఒక్కో రెస్టారెంట్ ఒక్కో స్టైల్ లో బిర్యానీ చేస్తుంది. సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఇలా ఎవరు వచ్చినా హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని వెళతారు. అయితే బిర్యానీ ధరలను రెస్టారెంట్లు భారీగా పెంచేశాయి.. దీనికి కారణం ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం. అక్కడ పాలన తాలిబన్ల చేతికి వెళ్లిన తర్వాత అక్కడ నుంచి ఏ సరుకు కూడా ఇతర దేశాలకు రావడం లేదు.
బిర్యానీలో వాడే రకరకాల మసాల దినుసులు మనకు ఆఫ్ఘనిస్థాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. అక్కడ నుంచి ఈ సరుకు రాకపోవడంతో ఇక్కడ ఉన్నా రేట్లకు రెక్కలు వచ్చేశాయి. అంజీర్, షాజీరా, బ్లాక్ ఆప్రికాట్, గ్రీన్ ఆప్రికాట్ ఇవన్నీ కూడా ధరలు అమాంతం పెరిగిపోయాయి.
కొన్ని పెద్ద రెస్టారెంట్లు బిర్యానీపై సగటున రూ.100కుపైనే పెంచేశారు..
కొన్ని చోట్ల 250 బిర్యానీ 350 అయింది
జంబో ప్యాక్ 390 ది 520 అయింది
ఫ్యామిలీ పాక్ 650 ది 790 అయింది.
అయితే చిన్న పట్టణాల్లో మాత్రం బిర్యానీ ధరలు పెరగలేదట.