కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడులో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 10, 2022 వరకు మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే, 9వ తరగతి నుంచి కళాశాల వరకు విద్యార్థులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు.