చంద్రబాబు తానా తమ్ముళ్లు తందాన

చంద్రబాబు తానా తమ్ముళ్లు తందాన

0
91

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తానా అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు తందానా అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లా టీడీపీ నేతలు బానిస బతుకులు బతకొద్దని అన్నారు… విశాఖ సెక్రటేరియట్ ఏర్పాటుకు తామందరం స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు…

రాజకీయ అవసరాలకోసం టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు తానా అంటే తందాని అని అనకండని అన్నారు వీర భద్రరావు…

కాగా ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహుషా ఏపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అంటూ ప్రసంగించారు… అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ రావచ్చు, విశాఖ పట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూల్ జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు