టార్గెట్ తెలంగాణ..బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం

0
93
MLA Raja Singh

తెలంగాణాలో బీజేపీ దూకుడు పెంచింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ కీల‌క నియామ‌కాన్ని ప్ర‌క‌టించింది.

బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సునీల్ బ‌న్స‌ల్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా బుధ‌వారం సాయంత్రం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం బీజేపీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాఖ ప్ర‌ధాన కార్య‌దర్శిగా కొన‌సాగుతున్న బ‌న్స‌ల్‌కు తాజాగా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పించారు.

అంతేకాకుండా ఆయ‌న‌కు తెలంగాణ పార్టీ శాఖ ఇంచార్జీ బాధ్య‌త‌ల‌తో పాటుగా ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా శాఖ‌ల ఇంచార్జీగానూ నియ‌మించారు. బెంగాల్ , ఒడిశాలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో పాటు, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో సునీల్ బన్సాల్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.