కార్పొరేట్ సెక్టార్లు అందరూ కూడా ఇప్పుడు ఈ బిజినెస్ ఆన్ లైన్ బిజినెస్ తో దూసుకుపోతున్నారు, డోర్ స్టెప్ డెలివరీ గూడ్స్ తో వ్యాపారం అదరగొడుతున్నారు, ఇక అమెజాన్ కు ఈ వ్యాపారంలో తిరుగులేదు, ఇక తాజాగా రిలయన్స్ జియో మార్ట్ కూడా వచ్చేసింది ఈ వ్యాపారంలోకి.
అయితే తాజాగా రిలయన్స్, అమెజాన్ లకు దీటుగా- గుండుసూది నుంచి కారు వరకూ కావాల్సిన దేన్నయినా ఆర్డర్ చేసుకునేలా టాటా గ్రూప్ ఓ సూపర్ యాప్ ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది, సో ఇప్పటికే అనేక వస్తులువు తయారు చేస్తున్న టాటా గ్రూప్ తన గూడ్స్ ఇలా అమ్మినా మంచి షేర్ వస్తుంది అంటున్నారు వ్యాపారులు.
ఈ యాప్ ను డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో టాటా గ్రూప్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఈ-కామర్స్ వాణిజ్యంలో తమదైన ప్రభావాన్ని చూపేందుకు టాటా కంపెనీ సిద్దం అవుతోంది.
ఇప్పటికే 113 బిలియన్ డాలర్ల విలువైన గ్రూప్ గా ఉంది టాటా కంపెనీ, ఆహార ఉత్పత్తులు, నిత్యావసరాలు, ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, గృహోపకరణాలు, ఇలా అన్నీ ఈ యాప్ ద్వారా అందించేందుకు సిద్దం అవుతున్నారట.