Flash-టీడీపీ బంద్‌..ఏపీలో టెన్షన్..టెన్షన్

TDP bandh..Hight tension in AP

0
88

ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి.

వైసీపీ నేతల దాడికి నిరసనగా టీడీపీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. వైసీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఏపీలో వైసీపీకి నిరసనగా టీడీపీ బంద్‌ కొనసాగుతోంది. ఆయ ప్రాంతాల్లో బస్టాండ్‌ వద్ద నిరసనగా దిగారు. బస్సులు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. శ్రీకాకుళం బస్టాండు దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో నిరసనగా దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒంగోలులో టీడీపీ నేతలను అరెస్టు చేశారు.