మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నాటినించి 2014 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాయాం వరకు అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా వ్యవహరించింది… అయితే 2019 ఎన్నికల్లో జగన్ సునామి తో కేవలం టీడీపీ 14 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు స్థానాను గెలుచుకుంది…. అందులో ఒకటి హిందూపురం మరోకటి ఉరవకొండ ఈ రెండు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోల వైసీపీ జెండా ఎగిరింది..
దీంతో జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీనేతల కార్యకర్తలతో సమావేశం అయ్యారు…. ఈక్రమంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి… ఉన్న వర్గీయులకు ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఉమా మహేశ్వర నాయుడు మధ్య విభేదాలు తలెత్తాయి…
ముందుగా తన సొంత కార్యకర్తలతో ఉమా సమావేశం ఏర్పాటు చేశారు… ఈ సమావేశానికి బీటీ నాయుడు పాల్గొన్నారు… ముందుగా ఉమా సమావేశానికి పాల్గొన్న బీటీ ఆ తర్వాత ఉన్నం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు… దీంతో ఉన్న వర్గీయులు బీటీని చుట్టుముట్టారు… ఇంచార్జ్ గా నియమించకపోయినా ఉమా వర్గీలు ఇంచార్జ్ గా ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు… ఈ క్రమంలో ఉన్నం వర్గీలను ఉమా వర్గీయులు దూరం చేస్తున్నారని వారు మండిపడ్డారు…