టీడీపీకి మరో షాక్ ఇవ్వనున్న పవన్

టీడీపీకి మరో షాక్ ఇవ్వనున్న పవన్

0
92

తెలుగుదేశం పార్టీని ఓసారి నమ్మి మనం మోసపోయాం, మళ్లీ ఇప్పుడు ఆపార్టీతో కలిసి ముందుకు వెళితే అసలుకే మోసం వస్తుంది, దయచేసి సైకిల్ తో సవారి వద్దు అని పవన్ కల్యాణ్ కు జనసేన పార్టీ నేతేలు చెబుతున్నారట.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్న సమయంలో పవన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కల్యాణ్ ఇమేజ్ కు డ్యామేజ్ అయింది.

అసలు పవన్ వల్ల మాకు అధికారం రాలేదు, ఆయన ఇంపాక్ట్ లేదు అని అన్నారు. పవన్ కల్యాణ్ మళ్లీ 2019లో టీడీపీకి దగ్గర అయ్యారు అని, అందుకే ప్రజలు కూడా పవన్ ని పక్కన పెట్టారు అనేది మీడియాలో కూడా చర్చ జరిగింది.

ఇక తాజాగా చంద్రబాబు పవన్ కు సపోర్ట్ కామెంట్స్ చేయడం, అలాగే పవన్ చంద్రబాబుకి సపోర్ట్ కామెంట్స్ చేయడం వల్ల ప్రజల్లో కూడా దీని గురించి నెగిటీవ్ గా పోట్రెట్ అవుతోంది, ప్రజలు కూడా జనసేన నాయకులని నిలదీస్తున్నారు.. అందుకే ఇటీవల ఈ విషయాన్ని జనసేనానికి నేరుగా చెప్పారట. అందుకే పవన్ కూడా ఇక ఆచితూచి అడుగులు వేయనున్నారు అని తెలుస్తోంది.