2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో గందరగోళం నెలకొంది… ఉదయం వరకు టీడీపీలో ఉన్న కీలకనేతలు సాయంత్రం అయ్యేలోపు బీజేపీలోకో లేదంటే వైసీపీలోకి జంప్ చేస్తున్నారు…
ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీలోకి అలాగే బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే… అయితే ఇదే క్రమంలో మరో కీలక నేత వైసీపీలో చేరాలను చూస్తున్నారు… నెల్లూరు జిల్లాకు చెందిన ఆ కీలక నేత మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరాలని చూస్తున్నారు…
గత ఎన్నికల్లో పదికి 10 నియోజకవర్గాలను కైవసం చేసుకున్న వైసీపీ స్థానికి సంస్థల ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని భావిస్తోంది… అందుకే టీడీపీ బడా వికెట్లను పార్టీలో చేర్చుకుంటోంది. అందులో భాగంగానే ఆ కీలక నేతను వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…