ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశం అయిన అధికార వైసీపీ నాయకులకు అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి…. ఒకానొక సమయంలో వ్యక్తి గతంగా కూడా విమర్శలు చేసుకున్న సందర్భలు కూడా ఉన్నాయి…
ఇక ఇదే క్రమంలో పార్లమెంట్ సమావేశాలు వేధికగా టీడీపీ ఏంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీకి 25కి25 పార్లమెంట్ స్థానాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకువస్తామని చెప్పారని అయితే 22 ఎంపీ సీట్లు రాష్ట్ర ప్రజలు ఇచ్చినా కూడా ప్రత్యేక హోదాను వైసీపీ సాధించలేకపోయిందని ఆరోపించారు…
వైసీపీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తుందని ఇంతవరకు ప్రత్యేకహోదా విషయంలో ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు రామ్మోహన్ నాయుడు… ప్రత్యేకహోదాను వైసీపీ నాయకులు ఏ విధంగా సాధిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు… అంతేకాదు ప్రత్యేక హోదాకోసం వైసీపీ ఎంపీలు పోరాడితే తాము కూడా మద్దతు ఇస్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు…