TDP official twitter account hacked: టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాక్ చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. టీడీపీ ట్విట్టర్ హ్యాండల్ స్థానంలో టైలర్ హాట్స్ అనే పేరు రావటంతో, ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యినట్లు గుర్తించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్‌కు సంబంధించిన పోస్టులు ప్రత్యక్షం అయ్యినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. తమ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వటం వెనుక వైసీపీ ఉన్నట్లు పార్టీ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై ఇప్పటికే ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశామనీ. మరికాసేపట్లోనే పునరుద్ధరిస్తామని ట్విట్టర్ ప్రతినిధులు తెలిపినట్లు టీడీపీ శ్రేణులు వివరించారు.
TDP official twitter: టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్
-