టీడీపీ పై స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం

టీడీపీ పై స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం

0
94

తమ్మినేని సీతారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు… సిక్కోలు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు అయితే గతంలో ఆయన చంద్రబాబు దగ్గర కూడా పనిచేశారు… టీడీపీలో పదవులు అలంకరించారు. అయితే ఇప్పుడు వైసీపీలో ఉండి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సీనియర్ గా ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చారు సీఎం జగన్.. అయితే తాజాగా ఆయన పై తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్ సైట్లో ఒక కథనాన్ని పోస్టు చేశారు. అందులో తమ్మినేనిని తీవ్రంగా దూషించారు.

దీనిపై ఆయన ఫైర్ అవుతున్నారట, అసలు స్పీకర్ అధికారాలు పనులు ఏమిటి… స్పీకర్ అంటే ఎలా ఉండాలో తమ్మినేని సీతారాంకు తెలియదా, ఆయన రాజకీయాలు మాట్లాడటం ఏమిటి అని వార్త ప్రచురించారు. అంతేకాదు దున్నపోతు, ఆంబోతు అంటూ ఇష్టారాజ్యంగా ఆయనపై అసత్య కథనాలతో చెలరేగిపోయింది ఆ పత్రిక…. శాసనసభ స్పీకర్ కి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా దారుణ పదాలతో దూషణలకు పాల్పడింది.

అలాగే అసెంబ్లీలో నిద్రపోతాడు.. జనం ముందు బయటకు వచ్చి ఆంబోతులా రంకెలేస్తుంటాడు నీది కూడా ఒక బ్రతుకేనా అంటూ నీచత్వానికి ఒడిగట్టింది. దీనిపై స్పీకర్ కార్యాలయం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల అసత్య కథనాలు, నేతలపై ప్రభుత్వాలను కించపరుస్తూ వార్తలు మీడియాలు రాస్తే వారిపై కేసులు పెడతాము అని సర్కారు హెచ్చరించింది, తాజాగా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ సిబ్బంది సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నారట.