టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7 నుంచి జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ ఎల్పీ నిర్ణయం తీసుకుంది. కాగ ఈ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం దూరంగా ఉండనున్నారు. ఆయన తప్ప మిగితా అందరూ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కాగ గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్ర బాబు సతీమణి భూవనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తాను ఇక అసెంబ్లీలో అడుగు పెట్టబోనని చంద్రబాబు శపధం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తప్ప మిగతా వారంతా సమావేశాలకు వెళ్లనున్నారు.