మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై టీ కాంగ్రెస్ ఫిర్యాదు..నామినేషన్‌ తిరస్కరించాలని వినతి

Tea Congress complaint against former IAS Venkatramireddy..request to reject nomination

0
80

మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డిపై కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ పత్రాల్లో పొందు పరిచిన సమాచారం ఆన్ లైన్ లో పెట్టాలి. లేకుంటే.. ఎన్నికల నిర్వహణ అధికారి చర్యలు తీసుకోవాలి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆ సమాచారం పెట్టలేదు. సీఈవో శశాంక్ గోయల్ కు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ పై కంప్లైంట్ చేశాం.

అదేవిధంగా..మాజీ ఐఏఎస్ అధికారి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై ఫిర్యాదు చేశాం. వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదులు వున్నాయి. హైకోర్టులో కేసులున్నాయి. DOPT రాజీనామా ఆమోదించిన తర్వాత నామినేషన్ వేయాలి. కానీ అది లేకుండానే సిఎస్ ఆమోదించారు.

పశ్చిమ బెంగాల్ లో సీఎస్ రాజీనామా చేసిన DOPT ఆమోదించలేదు. తక్షణమే స్పెషల్ అబ్జర్వర్ ద్వారా నివేదిక తెచ్చుకోవాలని CEOను కోరాం. వెంకట్రామిరెడ్డిపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్ లో నమోదు చేసినట్లు తెలిసింది. ఆయన కోర్టు ఉల్లంఘించిన కేసులున్నాయి. అవి కూడా నమోదు చేయలేదంటే.. ఆయన నామినేషన్ పత్రాలు తిరస్కరించాలని కోరామన్నారు.