రంగంలోకి టీ కాంగ్రెస్..రెండు రోజుల పాటు ‘వరి దీక్ష’

Tea Congress enters the field .. 'Rice initiation' for two days

0
97

తెలంగాణ రైతుల సమస్యలపై గళం విప్పేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి వరి సాగుపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ వరి దీక్ష చేపట్టనున్నారు. దీనితో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని టీ కాంగ్రెస్ భావిస్తుంది.

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శని, ఆదివారాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘వరి దీక్ష’ చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేసి రేపు 5 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్య నేతలు రెండు రోజుల పాటు జరిగే దీక్షలో భాగంగా శనివారం రాత్రి ముఖ్యనేతలు దీక్షాస్థలిలోనే ఉంటారని తెలిపారు. దగా పడుతున్న రైతులకు అండగా ఉంటామని, ప్రభుత్వాల మెడలు వంచి వారిని ఆదుకుంటామని పేర్కొన్నారు.

రైతులకు న్యాయం చేసే దాకా పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు సమస్యలకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే కారణమని రేవంత్ ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు రైతులకు ద్రోహం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతుల నుంచి ప్రతి గింజ కొని రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.