కేంద్రం విధించిన లాక్ డౌన్ ఇప్పటికే 45 రోజులు పూర్తి అయింది.. అయితే రెడ్ జోన్లు కంటైన్ మెంట్ జోన్లు మినహ మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం, ఈ సమయంలో హోటల్స్ రెస్టారెంట్లు ఓపెన్ చేయలేదు బార్లు పబ్ లకి కూడా అనుమతి లేదు ఇక సినిమా హాల్స్ ప్రార్ధన మందిరాలు కూడా తీయడం లేదు.
అయితే 45 రోజులుగా అందరూ ఇంటికి పరిమితం అయిన పరిస్దితి, ఈ సమయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం.టీ స్టాళ్లు, దుకాణాలు సహా ఇతర ప్రయివేటు సంస్థల కార్యకలాపాలకు తమిళనాడు ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది.
అయితే ఇష్టం వచ్చినట్లు టీ దుకాణాల దగ్గర జనాలు ఉండకూడదు, అక్కడ తాగడం కూడా చేయకూడదు, కేవలం పార్శిల్ మాత్రమే ఇస్తారు, ఇక తమిళనాడులో సోమవారం నుంచి ఇవి తెరచుకోనున్నాయి.. టీ స్టాల్స్ బయట, లోపల ఎవ్వరూ టీ తాగడానికి వీల్లేదు, ఎవరైనా అక్కడ తాగడానికి అడిగినా ఇవ్వకూడదు, ఇక కచ్చితంగా రోజుకి ఐదు ఆరు సార్లు టీ స్టాల్ శానిటైజ్ చేయాలి..
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.