బయటకు రాగానే మీడియాతో మాట్లాడనున్న తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna will speak to the media when he comes out

0
88

గత రెండు నెలలకు పైగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. ఒక కేసులో బెయిల్ పై బయటకు రాగానే మరో కేసులో తీన్మార్ మల్లన్నను ఇరికించి జైలుకు పంపించారని చర్చ ప్రధానంగా జరిగింది.
మరోవైపు మల్లన్నపై CCSలో మరో కేసు. కోర్టు తీర్పు ఉన్నందున కేసు తిరస్కరణ. తీన్మార్ మల్లన్న రాత్రి 7:30కి రిలీజ్ కాబోతున్నారు. బయటకు రాగానే మీడియాతో మాట్లాడుతారని తెలుస్తుంది.

తెలంగాణా ప్రభుత్వం తీన్మార్ మల్లన్నను పదే పదే టార్గెట్ చేసి వివిధ కేసులలో ఇరికించి ఇబ్బంది పెడుతున్న క్రమంలో మల్లన్న తాజాగా బెయిల్ పై బయటకు రానున్నారు. మరి ఇప్పుడైనా మల్లన్నను కేసీఆర్ సర్కార్ విడిచిపెడుతుందా? లేదా మళ్ళీ ఏదో ఒక కేసులో ఇరికిస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తీన్మార్ మల్లన్న గతంలోలా మళ్ళీ కేసీఆర్ పై దూకుడు చూపిస్తారా? లేకా సైలెంట్ గా ఉంటారా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.`