హిమాన్షుపై తీన్మార్ మల్లన్న అసభ్య ట్వీట్..కేటీఆర్ కు సపోర్ట్ గా ట్వీట్ల వర్షం

Teenmar Mallanna's obscene tweet on Himanshu .. Rain of tweets in support of KTR

0
101

తీన్మార్ మల్లన్న ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన క్యూ న్యూస్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ నిర్వహిస్తున్నారు కూడా. ఆయన తన యూట్యూబ్ ఛానల్‌లో నిర్వహించిన ఓ పోల్ వివాదాస్పదం అయ్యింది. దీనితో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

‘అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా?’ అంటూ తీన్మార్‌ మల్లన్న పోల్‌ నిర్వహించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు చేశారు. మీరు తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ ఫైర్‌ అయ్యారు. నా కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా? అంటూ మంత్రి ప్రశ్నించారు. ఇలాగే మోదీ, అమిత్ షా కుటుంబాలను లాగితే ఊరుకుంటారా? అని ట్వీట్‌లో మంత్రి ప్రశ్నించారు.

ఈ విషయంపై కేటీఆర్ కు షర్మిల, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేశారు. చిన్నపిల్లపై ఇలాంటి అసభ్య ట్వీట్లు చేయడం వల్ల కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్నపై బంజారాహిల్స్ లో కేసు కూడా నమోదు అయింది.

https://twitter.com/KTRTRS?r