ఈ వర్షాకాలం వచ్చింది అంటే ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది, మరీ ముఖ్యంగా వర్షంలో ఇంకా బాగుంటుంది నేచర్ …భారీ వర్షాలతో అడవి దట్టమైన ఆకులతో నిండిపోతుంది, ఇక జల కళ సంతరించుకుంటుంది ఎక్కడ చూసినా.
వాగులు వంకలు సెలయేల్లు డ్యామ్ లు అన్నీ కూడా నిండుకుండలా మారతాయి. తాజాగా తెలంగాణలో కూడా అన్నీ జలపాతాలు నీటితో పలకరిస్తున్నాయి, మరి తెలంగాణలో ఉన్న ఈ జలపాతాలు చూద్దాం.
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం
మహబూబాబాద్ జిల్లా గంగారం మండల శివారులో ఉన్న ఏడు బావుల జలపాతం
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యంధార జలపాతం
పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మిట్టె జలపాతం
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని గుండాయి జలపాతం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతం
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని కనకాయ జలపాతం