ఫ్లాష్ న్యూస్: దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

0
103

దళితబంధుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళితబంధు హుజూరాబాద్‌ కోసం తీసుకొచ్చింది కాదని సీఎం స్పష్టం చేశారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకుందన్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నట్లు చెప్పారు. దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉందని..కరోనా వల్ల దళితబంధు పథకం ఏడాది ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. కరోనా వల్ల రూ.లక్ష కోట్లు నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు.