Breaking News : తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్

Telangana Congress leaders arrested

0
104

దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తుంది. ఆందోళనల్లో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుగా ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఆ తర్వాత రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరుతుండగా పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.