తెలంగాణ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల

0
62

తెలంగాణ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. జులై 13న జరగనున్న ఈసెట్​కు ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 వరకు ఆన్ లైన్​లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 400 రూపాయలు, ఇతరులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలని కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.