పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకొంది. మేయర్లు, ఛైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ ఛైర్పర్సన్లు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ పురపాలకశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే అందులో జులై నెల నుంచి గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.