విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త..వివరాలు వెల్లడించిన మంత్రి గంగుల

0
73

తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 33 బీసీ గురుకులాలతో పాటు 15 బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

ఇప్పటికే ఉన్న 261 గురుకుల స్కూళ్లకు అధనంగా జిల్లాకొకటి చొప్పున కొత్తగా 33 గురుకులాలను, 15 డిగ్రీ కాలేజీలను బీసీలకు కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది.ఈ ఏడాది నుంచి ఈ విద్యా సంస్థల్లో 8 రకాల కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. వీటి ద్వారా 1200 మంది విద్యార్థులకు అదనంగా 4800 మంది బీసీ బిడ్డలకు లబ్దీ చేకూరుతుందన్నారు.