కరోనా ఆంక్షలు ఎత్తేసిన తెలంగాణ సర్కార్!

Telangana government lifts corona restrictions!

0
71

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనితో సర్కార్ పలు ఆంక్షలు విధించింది. బహిరంగ సభలు, ర్యాలీలు, రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాల్లో మాస్ గ్యాదరింగ్‌ కు అనుమతి లేదంటూ జనవరి ఒకటిన ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

అయితే బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ ను తప్పనిసరి అంటూ అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఆంక్షల పొడిగింపుపై సర్కార్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది. జనవరి 31వ తేదీతో ఆ ఆంక్షల గడువు పూర్తి అయిపోయింది. ఇక ఇవాళ ఫిబ్రవరి 1వ తేదీ. అయినప్పటికీ ప్రభుత్వం ఉత్తర్వులు పొడగించలేదు.

దీంతో ఆంక్షలు లేనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినట్టుగా సమాచారం అందుతుంది. నేటి నుంచే తెలంగాణాలో పాఠశాలలు కూడా తెరుచుకున్నాయి. దీనితో మిగతా ఆంక్షలను సడలించినట్టు తెలుస్తుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.