తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే

Telangana government's key decision .. Fever survey across the state from tomorrow

0
108

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, వ్యాధి వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఫీవర్ సర్వే నిర్వహించి లక్షణాలను ఉన్న వారికి కరోన కిట్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఫీవర్ సర్వే సెకండ్ వేవ్ లో మంచి ఫలితాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాదు ఈ ఫీవర్ సర్వే నీతి ఆయోగ్ వారి ప్రశంస అందుకుందని చెప్పారు మంత్రి హరీష్ రావు. అయితే ప్రస్తుతం కొంతమంది కొన్ని లక్షణాలు కనిపిస్తున్నా టెస్ట్ లు చేసుకోవడం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఫీవర్ సర్వే మొదలు పెట్టనున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో ఇప్పటికే టెస్టులకు భారీగా కిట్ లను రెడీ చేసుకున్నామని చెప్పారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామం.. వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.