Breaking News: సినిమా టికెట్ల ధర పెంపు..తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

0
76

ఏపీలో సినిమా టికెట్ల ధర తగ్గింపుపై రచ్చ జరుగుతుంటే..తెలంగాణ సర్కార్‌ మాత్రం టికెట్ల ధర పెంపుపై సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్‌ రిక్వెస్ట్‌పై సానుకూలంగా రియాక్టయిన తెలంగాణ ప్రభుత్వం మూవీ టికెట్స్‌ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

కొత్త టికెట్‌ ధరలు ఈనెల 21 నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏసీ థియేటర్లలో టికెట్‌ కనీస ధర 50 రూపాయలుగా నిర్ణయించింది. ఏసీ థియేటర్లలో టికెట్‌ గరిష్ఠ ధర రూ.150 చేసింది. నాన్‌ ఏసీ థియేటర్లలో టికెట్‌ కనీస ధర రూ.30 రూపాయలు.. గరిష్ఠ ధర రూ.70 రూపాయలుగా నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌, ఐమాక్స్‌ల్లో టికెట్‌ కనీస ధర రూ.100 రూపాయలు వసూలు చేసుకోవచ్చన్న ప్రభుత్వం.. గరిష్ఠ ధర రూ.250 వరకు తీసుకొవచ్చని తెలిపింది.