Breaking- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండిలా..

0
157

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా ఈ ఏడాది  కరోనా ప్రభావంతో 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించారు.

మొదటి సంవత్సరం 63.32 శాతం, రెండో సంవత్సరం 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 72.35 శాతం కాగా.. రెండో సంవత్సరంలో 75.28 శాతం బాలికల ఉత్తీర్ణత నమోదు అయినట్లు చెప్పారు. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంటర్‌ సప్లీమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి.

ఫలితాలను ఈ కింది లింక్స్ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు

https://tsbie.cgg.gov.in/

https://www.bse.telangana.gov.in/

http://results.cgg.gov.in/

http://www.manabadi.co.in/