దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి: సీఎం కేసీఆర్

0
106

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం మాట్లాడారు.

‘ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికీ చేర్చామని..రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని చెప్పారు. మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నాం. వారి పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది. దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారింది. ఎన్నో అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోంది. బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ మారింది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించాం. గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచాం. గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచాం. 11.1 శాతం వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నాం. దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.