Flash: తెలంగాణ శాసనమండలి చైర్మన్‌కు కరోనా పాజిటివ్

0
90

కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఇటీవల కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.