నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామ నిధుల కోసం సిఎం ను కలిసేవాళ్ళం : సత్యవతి రాథోడ్

0
111

ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు దేశానికి తలమానికంగా తయారవుతున్నాయని, పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో విలసిల్లుతున్నాయని, స్వయం సమృద్ధ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు చెప్పారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా నేడు మహబూబాబాద్, బయ్యారం మండలంలో సత్యనారాయణపురం, గంధంపల్లి ప్రాంతాల్లో పర్యటించి విద్యుత్ సబ్ స్టేషన్లను తనిఖీ చేసి, హరిత హారంలో మొక్కలు నాటారు. అనంతరం దళితవాడలలో తిరిగి గ్రామసభలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కామెంట్స్..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి పల్లె ప్రగతి కార్యక్రమం దళితవాలలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు.

త్వరలోనే దళిత జీవితాల్లో వెలుగు నింపే విధంగా సీఎం దళిత క్రాంతి పథకం రాబోతుంది. ఇకపై దళితులు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ పథకం ఉపయోగపడనుంది.

ఈ పథకం ద్వారా ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయించిన దానికంటే అదనంగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

ప్రతి గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి నెల, నెల నిధులు అందిస్తున్నారు.

నేను సర్పంచ్ గా పని చేసిన కాలంలో గ్రామంలో మౌలిక వసతికి లక్ష రూపాయలు కావాలంటే ముఖ్యమంత్రిని సైతం కలిసి కోరిన సందర్భాలు ఉన్నాయి.

కానీ నేడు సీఎం కేసిఆర్ అడగకుండానే గ్రామాలకు పల్లె ప్రగతి కోసం రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ప్రతి నెల 369 కోట్ల రూపాయలను ఇస్తూ వాటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

ప్రతి గ్రామంలో ట్యాంకర్లు, ట్రాలీలు, ట్రాక్టర్లు ఇచ్చి ఆ గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనం గా ఉండేలా చేస్తున్నారు.

చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు గౌరవంగా జరగాలని అందుకోసం ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మిస్తున్నారు. కలిగిన వాళ్ళు వారి స్థలాల్లో అంతిమ సంస్కారాలు చేస్తుంటే పేద వాళ్లకు కనీసం దహనం చేసే స్థలాలు లేక పడే ఇబ్బందులు గుర్తించి సీఎం కేసిఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమం అమలు చేస్తున్న సీఎం లేరన్నారు.

Mahabubabad Collector Abhilasha Abhinav

ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని ఇస్తున్నారు. తద్వారా కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు చాలా వరకు దూరం అయ్యాయి.

ఈ విధంగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు.

వైకుంఠ దామాలు, మరుగు దొడ్లు వాడాలి. కరెంట్ స్తంభాలు ఒక నియంత్రిత పద్దతిలో వేస్తూ నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, PACS చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, నేతలు పాల్గొన్నారు.