దొంగకు కొడుకే అయినా మంచోడనుకున్నం : జగన్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

0
106

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎపి రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించారు. ఆయన మాటల్లోనే చదవండి…

ఏపీలో అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు మాట్లాడుతుంటే కొందరు సంబందం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం.

రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాగానే తెలంగాణ ఇస్తా అని మభ్యపెట్టి..అధికారం వచ్చాక యూ టర్న్ తీసుకున్నారు.

ఆంధ్ర ప్రజలపై మాకు కోపం లేదు.

ఆంధ్రలో లేనట్టుగా తెలంగాణలో అభివృద్ధి, పరిస్థితులు ఉన్నాయి.

తండ్రి వైఎస్సార్ తప్పు చెస్తే కొడుకు అలా ఉండడు అనుకున్నాం.

తెలంగాణా నీటిని దోచుకుపోతుంటే రాజశేఖర్ రెడ్డిని దొంగ అనక ఏమంటారు.

ఇప్పుడు కొడుకు జగన్ అలానే నీటిని దోచుకు పోతున్నారు.

తెలంగాణకు అన్యాయం జరగనివ్వం.

పిజెఆర్ చావుకు వైఎస్ ఆర్ కారణం కాదా..?

నక్సల్స్ పేరుతో తెలంగాణ ప్రజలను చంపింది వైఎస్ ఆర్ కాదా?

తెలంగాణను దోచుకు పోయారు.

వైఎస్ఆర్ తెలంగాణకు ఏమి చేశారు.

ఉద్యమంలో ఉన్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు.

హైదరాబాద్ చుట్టు ఉన్న భూములు దోచుకున్నారు.

విద్యార్థులకు మార్కులు తక్కువ వేసి వారి భవిష్యత్తుపై దాడి చేశారు.

తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ నరరూప రాక్షసుడు.

తెలంగాణా వెనుకబాటు తనానికి కారణం వైఎస్ఆర్.

మహబుబ్ నగర్ వాసులు 14 లక్షల మంది వలస పోవడానికి కారణం వైఎస్ ఆర్.

నవ్వుతూ నవ్వుతూ తెలంగాణకి వైఎస్ఆర్ అన్యాయం చేసారు.

ఊసరవెల్లిలా తెలంగాణ లో తిరుగుతున్నారు.

వైఎస్ఆర్ బతికుంటే తెలంగాణ రానియ్యకుండా ఉండేవారని  ఆంధ్రావారే అంటున్నారు.

తెలంగాణ తెచ్చుకుంటే సయోధ్య తో ఉందామనుకుంటే..నోట్లో చక్కెర..కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలు ఉన్నారు.

హైదరాబాద్ లో ఉండే ఆంధ్రావారు మాకు శత్రువులు కాదు.

ఏపీ నీటి పంచాయితీల వల్ల మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి.

అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలి.

తెలంగాణా కు అన్యాయం జరిగితే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావారు ఏపీని ప్రశ్నించాలి.