ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు

0
83

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజధానిలో యుద్ధ విమానాలు ప్రవేశించాయి. అయితే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం భయంతో జంకుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ లో భారతీయులు చిక్కునట్లు తెలుస్తుంది. వీరంతా ఇండియాకు తిరుగు ప్రయాణం కాగా అధికారులు అప్పటికే ఎయిర్ పోర్టును మూసివేశారు. దీనితో వారు ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. చిక్కుకున్న వారిలో నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఉక్రెయిన్ లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే. వీరిని రప్పించడానికి కేంద్ర విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.