తెలంగాణలో పురుడుపోసుకున్న కొత్త వేదిక

Establishment of Telangana journalists Adyanavedika

0
120

తెలంగాణ జర్నలిస్ట్ ల అధ్యయన వేదిక ఏర్పాటు ..

సోమవారం నాడు TNGO భవన్ లో తెలంగాణ జర్నలిస్ట్ ల అధ్యయన వేదిక ఏర్పాటు చేసారు తెలంగాణ జర్నలిస్టులు.  రాష్ట్రంలో వివిధ అంశాలు , ప్రజా సమస్యలు,జర్నలిస్ట్ ల సమస్యలపై అధ్యయన వేదిక ద్వారా పూర్తిస్థాయి అధ్యయనం చేసి బాధ్యతాయుతమైన అధికారులకు నివేదించాలని  పలు నిర్ణయాలు తీసుకున్నట్లు అధ్యయన వేదిక సభ్వులు వెల్లడించారు.

జర్నలిస్ట్ అధ్యయన వేదిక అధ్యక్షుడుగా బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా సాదిక్ పాషా ,జాయింట్ సెక్రటరీ గా మధు, కోశాధికారి గా సురేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యయన వేదిక సభ్యులు ప్రకటించారు.

అదే విధంగా అడ్వజరి బోర్డ్ సభ్యులుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, ఎంజేఎఫ్ అధ్యక్షుడు అశోక్,టీవి5 బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్,v6 బ్యూరో చీఫ్ వెంకట్ రాజ్,రాజేష్6టీవి,శివారెడ్డిv6, కొండల్ గౌడ్ 10 టీవి ,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కోడూరు శ్రీనివాస్, సముద్రాల సోము ,సిద్దార్థ, మహేందర్, రాజేష్ రెడ్డిలను నియమించాం అని వేదిక సభ్యలు తెలిపారు.

ఈ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఏ రాజకీయ పార్టీకి గానీ .. సంస్థలకు గానీ అలాగే ఏ యూనియన్ కు వ్యతిరేకం కానీ అనుకూలం కాదని స్పష్టం చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ల అధ్యయన వేదిక సభ్యులు.