తెలంగాణ బాగుపడుతుంది..ఇంకా బాగుపడుతది: సీఎం కేసీఆర్

0
89

జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన మొదలైంది. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జనగామలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుపడుతుంది. ఇంకా బాగుపడుతది. పది గ్రామాలకు నేషనల్ అవార్డ్స్ వస్తే అందులో తెలంగాణ నుండే ఏడు గ్రామాలున్నాయి. తెలంగాణలో ఎన్నటికీ కరెంటు పోదు.

సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ భవనం  అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 25 ఎకరాల్లో మూడంతస్తుల్లో.. రూ.32 కోట్ల వ్యయంతో.. 34 శాఖలు కొలువుతీరే విధంగా… కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. ఈ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్​, ఇద్దరు అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, డీఆర్​వో ఛాంబర్లు, కలెక్టరేట్ స్టాఫ్ హాల్ , స్టేట్ ఛాంబర్, స్టాఫ్ రూమ్, విశ్రాంతి గది, రెండు వెయిటింగ్ హాళ్లు, 25 మందికి సరిపోయే మినీ కాన్ఫరెన్స్ హాల్, 32 మందికి సరిపోయే కాన్ఫరెన్స్ హాల్, 250 మంది పెట్టె మీటింగ్ హాల్ ఉన్నాయి. 4 లిఫ్ట్​లు, అత్యవసర ద్వారాలు, హెలిపాడ్, 200 కార్లు పట్టే విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు మరెన్నో సౌకర్యాలున్నాయి.

సీఎం… తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభ కోసం తెరాస శ్రేణులు భారీగా జనసమీకరణ చేశారు. సుమారు లక్షకు పైగా ప్రజలు హాజరైనట్లు సమాచారం. ముఖ్యమంత్రి రాకతో జనగామ పట్టణ పరిసరాలు పూర్తిగా గులాబీమయమయ్యాయి. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ…. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.