టెలికం దిగ్గజం జియో కొత్త బ్రౌజర్ – తెలుగులో కూడా

-

టెలికం దిగ్గజం జియో దూసుకుపోతోంది, కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది, ఆఫర్లతో ఆకట్టుకుంటోంది, 5 జీ ఫోన్లు కూడా రిలయన్స్ తీసుకురాబోతోంది, అయితే జియో దేశంలోనే పెను మార్పు తీసుకువచ్చింది అని చెప్పాలి. తాజాగా జియో సరికొత్త మొబైల్ బ్రౌజర్ను లాంచ్ చేసింది.

- Advertisement -

దానికి జియోపేజెస్ అని పేరు పెట్టింది. గతంలో విడుదల చేసిన బ్రౌజర్కు ఇది అప్ డేటెడ్ వర్షన్. ఈ బ్రౌజర్ ద్వారా ఎనిమిది భారతీయ భాషల్లో ఇంటర్నెట్ సర్ఫింగ్ చేయవచ్చు. ఇక ఇందులో చాలా వరకూ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరికి మీ హిస్టరీ అనేది తెలియదు, చాలా గోప్యంగా ఉంటుంది, ఇక స్ధానిక సమాచారం వేగంగా వస్తుంది ఇందులో.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్రౌజర్ లో పేజీలు వేగంగా లోడ్ అవుతాయి, అలాగే వీడియోల స్ట్రీమింగ్ వేగంగా ఉంటుందని జియో వెల్లడించింది. ఈ బ్రౌజర్ ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే దీనిని 1.40 కోట్ల మంది వాడుతున్నారు, ఇది వారికి అప్ డేట్ వర్షన్ అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...