Telugu states mps have got berths in the nine Rajya sabha Committees: రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకంలో తెలుగు ఎంపీలకు చోటు దక్కింది. రాజ్యసభ కమిటీల ఏర్పాటుపై ఈ నెల 2న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీలను జగధీప్ ధన్కర్ ప్రకటించారు. తొమ్మిది కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు చోటుదక్కింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఎథిక్స్ కమిటీల్లో విజయ సాయి రెడ్డి(వైసీపీ), కే. కేశవరావు (టీఆర్ఎస్)లకు చోటు కల్పించారు. కాగా.. కమిటీ ఆన్ రూల్స్‌లో డాక్టర్ కే లక్ష్మణ్(బీజేపీ), కమిటీ ఆన్ ప్రివిలైజెస్‌లో జీవీఎల్ నర్సింహారావు(బీజేపీ), కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్‌లో కేఆర్ సురేశ్ రెడ్డి (టీఆర్ఎస్)లకు చోటు దక్కింది ఇక పోతే.. హౌజ్ కమిటీకి చైర్మన్‌గా సీఎం రమేశ్(బీజేపీ), హౌజ్ కమిటీ సభ్యుడిగా బడుగుల లింగయ్య(టీఆర్ఎస్)కు స్థానం దక్కించుకున్నారు.