బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత

0
139

తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు ఎండ, వానని సైతం లెక్కచేయకుండా ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు స్పష్టమైన హామీ లభించే వరకు తగ్గేదే లేదంటున్నారు.

తాజాగా నేడు మరోసారి బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తలు బాసర ట్రిపుల్‌ ఐటీలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ కార‍్యకర్తలు, పోలీసుల మధ‍్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఓ మహిళా కార్యకర్తను ఈడ్చుకెళ్లినట్టు సమాచారం. కాగా, అక్రమ అరెస్టులపై ఏబీవీపీ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.