Flash- ఉద్రిక్తత..బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల పరస్పర దాడి

0
36

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణను బీజేపీ ఎంపీ అరవింద్ చేతుల మీదుగా ప్రారంభించాలని బిజెపి మండల నాయకులు ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ ,బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. అయితేముందుగానే శివాజీ విగ్రహాన్ని టిఆర్ఎస్ శ్రేణులు ఆవిష్కరించడంతో ఘర్షణ నెలకొంది. టీఆర్ఎస్ ,బీజేపీ శ్రేణులు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణను అడ్డుకున్న పోలీసులకు గాయాలయ్యాయి. ఈ రాళ్ల దాడిలో ధర్పల్లి ఎస్సై వంశీ కృష్ణారెడ్డి మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు.