ఫ్లాష్: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్

0
76

బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లాలో కునూరు మీదుగా వెళ్తున్న క్రమంలో తెరాస శ్రేణులు బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనితో భాజపా కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు.