ఎంజే మార్కెట్ లో ఉద్రిక్తత..అస్సాం సీఎంను అడ్డుకున్న TRS లీడర్

0
120

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హైటెన్షన్ నెలకొంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవం సందర్బంగా ఎంజే మార్కెట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ టిఆర్ఎస్ నేత స్టేజిపైన ఉన్న సీఎం వద్దకు చేరారు.

పోలీసుల రక్షణ వలయాన్ని చెందించుకొని మరి సీఎం వద్దకు వెళ్లి మైక్ లాక్కున్నారు. దీనితో బీజేపీ , టిఆర్ఎస్ కార్యకర్తలకు  మధ్య తోపులాట చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు స్టేజిపైకి వెళ్లిన టిఆర్ఎస్ నేతను అదుపులోకి తీసుకున్నారు. దీనితో పరిస్థితి సద్దుమణిగింది.

ఈ ఘటన అనంతరం హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ..తెలంగాణలో ఒక్క ఫ్యామిలీకే మంచి జరుగుతోందని.. మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణకు రజాకార్ల పాలన నుంచి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. సర్కార్ అంటే ప్రజలందరి కోసమని.. కోవలం ఒక్క కుటుంబం కోసమే కాదన్నారు.