తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్కార్ చేపట్టిన ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జివో 317 ఉద్యోగుల్లో తీవ్ర అయోమయాన్ని,ఆందోళనకు గురి చేస్తోంది.
ముఖ్యంగా, ఇందులో స్థానికత అంశం లేకపోవడం, రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వుండటం ఆందోళనలకు దారి తీస్తోంది. దీనితో 317 జీఓ సవరించాలని జగరణ చేపట్టిన బండి సంజయ్ కు మద్దతుగా ఉద్యోగులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీనితో బండి సంజయ్ ను అరెస్టు చేసేందుకు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు.
అయితే కార్యకర్తలు మాత్రం బండి సంజయ్ ను అరెస్టు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహుతి చేసుకుంటామంటూ హల్ చల్ చేశారు. దీనితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలను వారిస్తున్నాడు.