పదవతరగతి పరీక్షల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం…?

పదవతరగతి పరీక్షల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...?

0
81

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇటీవలే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే… పదవతరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సర్కార్ నిర్ణయింది… ఇక ఇదే బాటలో తమిళనాడు కూడా నడిచింది… రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలు రద్దు చేస్తూన్నామని విద్యార్థులు నేరుగాతర్వాతి తరగతిలకు ప్రమోట్ చేస్తున్నామని ప్రకటించింది….

ఇక ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఇప్పుడున్న పరిస్థితిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం అసాధ్యం అని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.. ఒక వేళ సర్కార్ ముందుకు వెళ్లినా కొందరు కరోనా పేరుతో కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ఉంది..

ఇక అప్పుడు కూడా చిక్కులు తప్పవచ్చనే భావనలో సర్కార్ ఉంది… అందుకే ముందు జాగ్రత్తలో భాగంగా తెలంగాణ సర్కార్ చేసినట్లుగానే ఏపీ కూడా విద్యార్ధులందరిని పరీక్షలు లేకుండానే పాస్ చేయాలనే యోచనలో సర్కార్ ఉందని సమాచారం…