పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఇలా చూసుకోవాలి వెబ్ సైట్ ఇదే

పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఇలా చూసుకోవాలి వెబ్ సైట్ ఇదే

0
101

మొత్తానికి ఈ లాక్ డౌన్ తో పరీక్షలు మాత్రం నిర్వహించేందుకు అవ్వట్లేదు, దీంతో స్టూడెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, తెలంగాణ లో పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్సైట్లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మొత్తం 10 వ తరగతి విద్యార్దులు అందరూ పాస్ అయినట్లే అని తెలిపారు.. మెమోలు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు.

పదో తరగతి విద్యార్థులు తమ తమ గ్రేడ్లను చూసుకునేందుకు మొదట bse.telangana.gov.inలోకి లాగినై, టీఎస్ ఎస్సెస్సీ గ్రేడ్లు 2020 క్లిక్ చేయాలి. దీని తర్వాత పరీక్ష ఫలితాల పేజీ వస్తుంది. అక్కడ హల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, అక్కడ మీ గ్రేడింగ్ చూపిస్తుంది..