బ్రేకింగ్: తెరాస అభ్యర్థి గెల్లు నామినేషన్ దాఖలు

0
78

హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మధ్యాహ్నం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. మొదట రామాలయంలో పూజల అనంతరం ఆయన నామినేషన్ వేశారు. కాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల రోజే గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ ఉన్నారు.