మరో 6 నెలల్లో తెరాస చావబోతుంది..రేవంత్ సంచలన వ్యాఖ్యలు

0
101

సీఎం కేసీఆర్ సర్కార్ పై టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ అవినీతికి, ప్రభుత్వ తప్పుడు విధానాలకు కాళేశ్వరం బలైంది. రీడిజైన్ పేరుతో కాళేశ్వరంలో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

లక్షల ఎకరాల్లో పంట మునిగితే సీఎం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు పార్టీలోకి భాజపా నాయకురాలు కత్తి కార్తీక చేరిక సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎం కావడం మన దౌర్భాగ్యం. ప్రజలు కష్టాల్లో ఉంటే ఫిరాయింపు నేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే తెరాస సగం చచ్చిందని.. మరో 6 నెలల్లో పూర్తిగా ఖతమైపోతుందని రేవంత్‌ అన్నారు.

బండి సంజయ్, కిషన్​ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. వరదల్లో నష్టపోయిన బాధితులకు జాతీయ విపత్తుల నిధి నుంచి రెండు వేల కోట్లు తీసుకురండి. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని రేవంత్ కోరారు. ప్రభుత్వ తప్పుడు విధానాలకు ప్రజలు బలైయిండ్రు. ప్రాజెక్టుల అవినీతిపై నిర్మాణ, నిర్వహణ లోపంపై విచారణ జరపండి. కేసీఆర్ కమిషన్లతోనే మీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు.